![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -205 లో....భాగ్యం తన కూతురిని వేరు చేసి నర్మద, ప్రేమ కలిసి ఆడుకుంటున్నారని వాళ్ళని అవమానించడమే పనిగా పెట్టుకుంటుంది. నర్మద, ప్రేమ వాళ్ళ పుట్టింటి వాళ్ళ టాపిక్ తీసి భాగ్యం బాధపెడుతుంది. ఇద్దరు కూడా పక్కకు వెళ్లి బాధపడుతారు. ప్రేమ తన పుట్టింటి వాళ్ళ ఫోటో చూసి బాధపడుతుంటే అయితే మీ పుట్టింటికి వెళ్ళమని సరదాగా నెట్టేస్తాడు ధీరజ్. నేను వెళ్ళనని ప్రేమ అంటుంది.
మరొకవైపు శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతూ.. వాళ్ళకి బుద్ది చెప్పావ్ అమ్మ లేదంటే వాళ్ళు ఒకటి అయి నాతో ఆడుకుంటారా అని శ్రీవల్లి అంటుంది. మరి నా కూతురు జోలికి వస్తారా అని భాగ్యం అంటుంది. అప్పుడే చందు వచ్చి.. అత్తయ్య నేను మీకు ఇచ్చిన పది లక్షలు ఇవ్వండి అని వాళ్లపై కోప్పడతాడు. అప్పుడే భాగ్యం భర్త ఆనందరావు వచ్చి డమ్మి చెక్ ఇస్తాడు. అది ఇవ్వగానే చందు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదేంటీ బయట వాళ్ళకి డమ్మీ చెక్ ఇచ్చినట్లు అల్లుడికి ఇస్తావేంటని భాగ్యం పక్కకి తీసుకొని వెళ్లి తన భర్తపై కోప్పడుతుంది.
ఆ తర్వాత నర్మద దగ్గరికి భాగ్యం వచ్చి నా కూతురు జోలికి వచ్చావనుకో నీ సంగతి చెప్తానని వార్నింగ్ ఇస్తుంది. తరువాయి భాగంలో పెళ్లి కోసం భాగ్యం ఇంటిని రెంట్ కి తీసుకున్న దగ్గరికి ప్రేమ, నర్మద వెళ్తారు అక్కడ ఫోన్ నెంబర్ చూసి చెయ్యగా.. ఇది భాగ్యలక్ష్మి గారి ఇల్లు కదా అని అడుగుతారు. కాదు రెంట్ కి తీసుకున్నారు డబ్బు ఇవ్వలేదని వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత వేదవతి, శ్రీవల్లి దగ్గరికి వచ్చి మీ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. ఇంట్లోనే అని శ్రీవల్లి అనగానే ఇంట్లోనే ఉన్నారట అని నర్మదకి ఫోన్ లో చెప్తుంది వేదవతి. అయితే వాళ్ళని బయటకి రమ్మని చెప్పమని నర్మద అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |